ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు మంచి విద్యను బోధించాలని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం ఉట్నూర్ లోని ఐటీడీఏ కార్యాలయంలో డిడి, ఏటిడబ్ల్యూఓ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిసిసి ద్వారానే సరుకులను హాస్టళ్లకు సరఫరా చేయాలన్నారు. హాస్టల్లో ఉండే విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనం పెట్టినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.