ఉట్నూరు పట్టణంలో నిర్వహించే అన్నా భాహు సాటే జయంతికి రావాలని మాజీ జెడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ ను ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. గురువారం ఉట్నూరు పట్టణంలో మాజీ జడ్పీ చైర్మన్ వారు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. శుక్రవారం ఉట్నూరులో అన్నా బాహు సాటే జయంతి కార్యక్రమం ఉంటుందని, తప్పకుండా రావాలని ఆయనను వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కాంళ్లే డిగంబర్, అరికెల అశోక్, గాదెకర్ సంజు, మోరే శుక్రాచారి, తదితరులు పాల్గొన్నారు.