రాష్ట్ర మంత్రి జి. వివేక్ ను కాంగ్రెస్ పార్టీ ఉట్నూరు మండల నాయకులు కలిశారు. మంత్రి వివేక్ ఆదివారం సాయంత్రం ఉట్నూర్ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉట్నూర్ పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.