బడుగు, బలహీనవర్గాల పెన్నిధి మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను సాధిద్దామని కాంగ్రెస్ పార్టీ ఉట్నూర్ మండల నాయకులు అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం ఉట్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.