సమాజానికి ఆదర్శ వ్యక్తులు గురువులేనని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుమన్ భాయ్ అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా మోర్చా ఆదేశానుసారంగా గురువారం ఉట్నూరు పట్టణంలోని ఉపాధ్యాయులను, వేద పండితులను బీజేపీ నాయకులతో కలిసి ఆమె సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉట్నూర్ మండల అధ్యక్షులు బింకి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.