విద్యార్థులు బాగా చదువుకోవాలని ఉట్నూరు పట్టణానికి చెందిన సోఫా బైతుల్ మాల్ సంస్థ నిర్వాహకులు కోరారు. గురువారం ఉట్నూరు పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఉన్న యుపిఎస్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆ సంస్థ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు అహ్మద్బియాభాని, మక్బూల్ పాషా, అసీంఖాన్, అబ్బు బాయ్, అవేస్, మొహసిన్,. సాజిద్ సిద్ధికి, తదితరులు పాల్గొన్నారు.