బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. బుధవారం సాయంత్రం కడెం మండలంలోని అంబర్పేట గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు బొమ్మెన నర్సయ్య, ఖానాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.