జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏఎస్పీ

భైంసా పట్టణంలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాట యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో భైంసా సీఐ రాజారెడ్డి, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్