బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడుతోంది. విద్యా సంస్థలకు సెలవులు దగ్గర పడడంతో ఆలయంలో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి తమ చిన్నారులకు అక్షర శ్రీకారాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత కారణంగా భక్తులకు మంచి నీటి బాటిళ్లను పంపిణీ చేశారు.