ప్రాజెక్ట్ వసుంధరలో భాగంగా శనివారం బాసర ట్రిపుల్ ఐటీలో B19 బ్యాచ్ విద్యార్థులు వనమహోత్సవం, క్యాంపస్ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. టీం ఎస్డీజీ అధ్వర్యంలో వీసీ గోవర్ధన్, ఓఎస్డీ మురళీధరన్ తో కలిసి మొక్కలు నాటారు. వీసీ మాట్లాడుతూ విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. పచ్చదనం పట్ల ఉన్న బాధ్యతను భావితరాలకు వారసత్వాన్ని అందజేస్తుందన్నారు.