భైంసా: రోడ్డు భద్రతపై అవగాహన

రోడ్డు భద్రతపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని భైంసా పట్టణ సిఐ గోపీనాథ్ అన్నారు. జాతీయ రహదారి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాహనం నడిపే ప్రతిఒక్కరూ తన ప్రాణంతోపాటు ఇతరుల ప్రాణాన్ని రక్షించేందుకు రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్