రాజకీయాలకు అతీతంగా ముధోల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. మంగళవారం కుభీర్ మండలం మాలేగామ్ గ్రామంలో బైంసా నుండి మిర్జాపూర్, లింగా, కుంబి, నిగ్వ మహారాష్ట్ర బోర్డర్ వరకు రూ. 20 కోట్లతో నిర్మించనున్న రహదారికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పదేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను పరిష్కరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి, ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కొందరు సర్పంచులకు అభివృద్ధి కార్యక్రమాల ప్రొసీడింగ్‌లు ఇవ్వడంపై ఆయన ప్రశ్నించారు.