అయిల్ ఫామ్ పంటను సాగు వేసి అధిక లాభాలు సాధించాలి

మంగళవారం భైంసా పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్, రైతులు ఆయిల్ ఫామ్ పంటను సాగు చేసి అధిక లాభాలు సాధించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంటను ప్రోత్సహిస్తున్నాయని, ప్రస్తుతం ముధోల్ నియోజకవర్గంలో 4200 ఎకరాల్లో సాగు జరుగుతోందని, 20 వేల ఎకరాలకు విస్తరిస్తే ప్రాంతంలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం ఉత్తమ రైతులకు సన్మానం చేశారు.

సంబంధిత పోస్ట్