నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం నుంచి ఎరువులు అందుబాటులో ఉంటాయని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్ రత్నాకర్ రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బస్తా యూరియా ధర రూ. 270 గ్రోమోర్ 20-20-0-13 ధర రూ. 1100 ఉంటుందని కావాల్సిన రైతులు ఆధార్ కార్డ్, జిరాక్స్ తీసుకొని కార్యాలయానికి రావాలని కోరారు.