కుబీర్ మండల కేంద్రంలోని చాత క్లస్టర్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ (RO), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ARO)లకు అందజేశారు. ఈ ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శులు హెల్ప్ డెస్క్ వద్ద అభ్యర్థులకు సహకారం అందించారు. నిర్మల్ జిల్లాలో ఈ ఎన్నికల సందడి నెలకొంది.