ఇరిగేషన్ పథకానికి ఆర్థిక సాయం

బాసర మండల కేంద్రంలోని శ్రీవేదభారతి పీఠం వ్యవస్థాపకులు వేదవిద్యానంద గిరి స్వామి రైతుల శ్రేయస్సు కోసం తన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. గోదావరి నది నీటిపారుదల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అభివృద్ది కొరకు శుక్రవారం రూ. 50, 000 రైతులకు అందజేశారు. ఇకనుండి ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు స్వామివారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్