నిర్మల్ జిల్లా, ముధోల్ మండలంలోని బోరిగాం, గాన్నోర, వడ్తల, బ్రాహ్మణ గాం, సరస్వతి నగర్ గ్రామాల్లో మంగళవారం వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది. తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడిని డీజే పాటలకు నృత్యాలు చేస్తూ భక్తులు నిమజ్జనం చేశారు. నిమజ్జన మార్గంలో ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముధోల్ సిఐ రవీందర్ నాయక్, ఎస్పై పెర్సిస్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్త్ నిర్వహించారు.