భైంసా మండలం కుంసర గ్రామంలో మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ బుధవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణానికి 10 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, విద్యారంగం, మహిళా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.