తానూర్ మండలంలోని బోరేగాం గ్రామంలో ఓ బెల్ట్ షాపులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఎస్సై నవనీత్ రెడ్డి నేతృత్వంలో సిబ్బంది ఈ ఆకస్మిక తనిఖీ నిర్వహించి, సుమారు రూ. 7,610 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అనుమతి లేకుండా మద్యం విక్రయించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానాతో పాటు చట్టపరమైన శిక్షలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.