వానల్ పహాడ్లో ఘనంగా జయశంసార్ జయంతి వేడుకలు

నిర్మల్ జిల్లా, ముథోల్ మండలంలోని వానల్ పహాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచ్ ఎంపెల్లి నాగ లక్ష్మీ వినోద్ మాట్లాడుతూ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి, స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్