ఓటరు జాబితాను తప్పుల్లేకుండా పారదర్శకంగా రూపొందించాల్సిందిగా తహసిల్దార్ బి. శివరాజ్ సూచించారు. కుభీర్ రైతు వేదికలో సోమవారం బిల్వోలు, సూపర్‌వైజర్లకు విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. అర్హులైన యువతీ, యువకుల వివరాలు త్వరితంగా సేకరించి ఓటరు నమోదు వేగవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.