కుంటాల మండలంలోని పలు గ్రామాలలో విద్యుత్ సాధారణ, భారీ లైన్ల స్తంభాలపై పిట్టలు గూళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈదురుగాలులు వీచి వర్షాలు కురిసినప్పుడు గూళ్లకు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగుతున్నాయి. గూళ్ళు కాలి బూడిదవుతుండగా అందులో ఉంటున్న పిట్టల పిల్లలు మృత్యువాత పడుతున్నాయని గ్రామపంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులకు, సిబ్బందికి చెప్పిన పట్టించుకోవడం లేదని గురువారం స్థానికులు వాపోతున్నారు.