లోకేశ్వరం: బెల్టు దుకాణాలు నిర్వహిస్తే చర్యలు: ఎస్ఐ

లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలోని ఓ హోటల్లో నిల్వ ఉంచిన మద్యాన్ని శుక్రవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకొని యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కిషన్ గౌడ్ హోటల్ ను తనిఖీ చేయగా 15 బీర్లు, 26 మద్యం సీసాలు లభించాయని వాటి విలువ రూ. 9, 565 ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో బెల్టు దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్