లోకేశ్వరం: రామకృష్ణ పాఠశాలలో బుక్కులు పంపిణీ

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని రామకృష్ణ పాఠశాలలో కామాటి అసిని అనే విద్యార్థి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగయ్య మాట్లాడుతూ పుట్టినరోజు కోసం వృధా ఖర్చులకు పోకుండా పాఠశాలలో తమ తోటి విద్యార్థులకు సాయం చేయడం అభినందనీయమన్నారు. తోటి విద్యార్థులతో పాటు పాఠశాల సిబ్బంది కలిసి అమ్మాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్