పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన లోకేశ్వరం మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ కథనం ప్రకారం. ధర్మోరా గ్రామానికి చెందిన శ్రీనివాస్ (27) తల్లిదండ్రులు చనిపోవడంతో పెద్దమ్మ వద్ద పెరిగాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో పెళ్లి కావడం లేదని జీవితంపై విరక్తి చెంది గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దమ్మ పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.