తానూర్‌లో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు

తానూర్ మండలానికి చెందిన కటకం సోనీ (24) అనే వివాహిత జూలై 11న చిన్న కుమారుడితో ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమయ్యింది. గత సంవత్సరం నుండి తల్లి ఇంట్లో ఉంటున్న సోనిని తీసుకెళ్లేందుకు అదే రోజు భర్త పవన్ వచ్చి పెద్ద కుమారుడిని తీసుకెళ్లాడు. అనంతరం సోనీ కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్