నర్సాపూర్ జి మండలంలోని గొల్లమాడ గ్రామంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల మధ్య గుంపులుగా తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్న కోతులు, పంట పొలాలపై దండయాత్ర చేస్తున్నాయి. దీంతో రైతులు కొన్ని పంటలు వేయడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు. పాలకులు, అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.