ముథోల్: వ్యాపారస్తులు విధిగా లైసెన్స్ తీసుకోవాలి

వ్యాపారస్తులు విధిగా ట్రేడ్ లైసెన్స్ లను తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. శనివారం ముథోల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటి పన్ను వసూలు చేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం స్థానిక షాపుల్లో ట్రెడ్ లైసెన్స్ జారీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత గడువులోగా జారీ చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్