ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించడంతో ఆ విజయం చారిత్రాత్మకమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అవినీతిపరులను ప్రజలు ఇంటికి సాగనంపుతారని ఢిల్లీ ఎన్నికలే నిదర్శనమన్నారు. మూడో సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జీరో లోనే ఉందని ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మేస్థితిలో లేరన్నారు.