ముథోల్, తానూర్ మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన 63 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ శుక్రవారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అండగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులున్నారు.