ముధోల్: అతి పురాతనమైన నాణేలు లభ్యం

ముధోల్ లోని మారుతి అనే వ్యక్తి తన పశువుల పాక తొలగించి నూతన ఇంటి నిర్మాణం కోసం పునాది పనులు చేపడుతుండగా ఔరంగజేబు కాలం నాటి 92 నాణేలు బయటపడ్డాయి. విషయం గ్రహించిన యజమాని ఎస్ఐ సంజీవ్ కు తెలిపారు. ఆయన తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్ నారాయణ పటేల్ తో కలిసి నాణేలు బయట పడ్డ స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పంచనామా నిర్వహించి నాణేలను ముధోల్ ఉపకోశాధి కార్యాలయంలో డిపాజిట్ చేస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్