నిర్మల్: పోలీసుల కార్డెన్ సర్చ్.. వాహనాలు సీజ్

భైంసా మండలంలోని మహాగాం గ్రామంలో రూరల్ పోలీసులు మంగళవారం ఉదయం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, భైంసా రూరల్ సిఐ నైలు ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 104 బైక్లు, 7 ఆటోలను సీజ్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే పోలీసు శాఖ నిరంతరం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తుందని సిఐ నైలు తెలిపారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్