వాంకిడి మండలం ఖమన గ్రామం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శివకేశవ నగర్‌కు చెందిన కోదండ సాయి (23) మృతి చెందాడు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.