ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంటాల మండల కేంద్రం నుండి దౌనెల్లి వెళ్లే వంతెన వద్ద రోడ్డు పై గుంతలు ఏర్పడి బురదమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుకొంటున్నారు. విషయం తెలుసుకున్న దౌనెల్లి గ్రామానికి చెందిన ఎస్ కె ఖదీర్, ఎస్ కె అంజద్ జేసిబి సహాయంతో బురదను తొలగించి, గుంతలు పూడ్చి మరమ్మతులు చేపట్టారు. ప్రయాణికులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.