మున్సిపల్ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా పని చేయాలి

మున్సిపల్ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పని చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. ఆదివారం బైంసాలోని పూలే నగర్ కాలనీ వాసులు వాగ్మారే అనిల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. రిజర్వేషన్లు ఖరారయ్యాక అందరి అభిప్రాయం మేరకు అభ్యర్థిత్వాలు నిర్ణయిస్తామని, 9వ వార్డు సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్