నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఎన్. భాస్కర్ యాదవ్, ఇండియన్ ఆర్మీలో 24 సంవత్సరాలు దేశ సేవలు అందించి పదవీ విరమణ పొందారు. ఆదివారం ఆయన స్వగ్రామానికి చేరుకోగా, కాలనీవాసులు భారీగా జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. వీర తిలకం దిద్ది, డీజే చప్పులతో బైక్ ర్యాలీ నిర్వహించి, ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.