నిర్మల్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న పార్ట్‌టైం అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, కెమిస్ట్రీ, పీడీ/పీఈటీ, ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్, లైబ్రేరియన్‌తో పాటు పలు డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జూలై 4 నుంచి 9 వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ధృవపత్రాల పరిశీలన జూలై 10న జరుగుతుంది.