నిర్మల్ DCC అధ్యక్షులు వెడ్మ బొజ్జు భైంసా టౌన్ కాంగ్రెస్ నూతన కమిటీని ప్రకటించారు. AICC, PCC ఆదేశాలు, సంఘటన్ సృజన్ అభియాన్ కింద టౌన్ అధ్యక్షుడు కె. అరవింద్ సిఫార్సుతో 35 మందికి పదవులు ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎండి ఫారూక్ అహ్మద్, సయ్యద్ షాహిద్ నియమితులయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా ముఖిద్ (గోర్), మక్సూద్ అహ్మద్ ఖాన్, యెల్ల్ల రాజేశ్వర్, ఎస్డీ అలా, ఎం. చిన్న స్వామి, జనరల్ సెక్రటరీలుగా ఎండి రఫీ, సయ్యద్ ఆరిఫ్, సయ్యద్ షబీర్, కె. రవీందర్ లను నియమించినట్లు తెలిపారు. ముధోల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ అభినందనలు తెలిపారు.