మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం.. రైతుల ఆందోళన

మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యంతో ఆగ్రహించిన రైతులు బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత పది రోజుల క్రితం తీసుకొచ్చిన పంటకు ఇప్పటివరకు తూకం వేయలేదని, గన్నీ సంచులు ఇవ్వడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొనుగోళ్లు వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్