ఎన్నికల ఖర్చుల వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను తప్పనిసరిగా నిర్ణీత గడువులోగా సమర్పించాలని జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు జి. వీరా రెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్‌తో కలిసి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులకు ఎన్నికల వ్యయాలపై పూర్తి అవగాహన కల్పించాలని, అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అన్ని రకాల ఫారాలు, రిజిస్టర్లను సక్రమంగా పూరించాలని అధికారులకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్