జిల్లా స్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు శనివారం నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లాలోని వివిధ మండలాల నుండి సుమారు 60 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడా ప్రతిభను గుర్తించి, ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్