నిర్మల్ జిల్లా బైంసా గోశాలకు ఆదర్శ చారి రూ. 1100 విరాళం అందజేశారు. గోశాల నిర్వహణకు తన వంతు సహకారం అందించడం అభినందనీయమని గోశాల కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గోసేవ మహా పుణ్యకార్యమని, ఇలాంటి దాతల సహకారంతోనే గోశాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దాతకు గోమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గోసేవకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.