రోడ్డు ప్రమాదంలో వృద్ధునికి గాయాలు

లక్ష్మణాచందా మండలం బోరిగాం గ్రామం వద్ద మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన గంగారం అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. బంధువుల ఇంటికి వెళ్తున్న వృద్ధుడిని ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఈఎంటి శేఖర్, పైలెట్ విజయ్ కుమార్ క్షతగాత్రుడిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్