గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న పంట తడవకుండా కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టార్పాలిన్ కవర్లతో పంటలను కప్పేందుకు పరుగులు తీశారు. ఈ అకాల వర్షం వల్ల పంట నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.