నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్షిస్తూ ఉండాలని, నిర్మాణాలు మందగించిన ప్రాంతాల్లో లబ్ధిదారులతో మాట్లాడుతూ, నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చూడాలని సూచించారు.