తెలంగాణ ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్, ఉద్యమకారులను గుర్తించడంలో విఫలమైందని ఎస్సీ ఎస్టీ మాజీ కమిషన్ చైర్మన్, విద్యార్థి ఉద్యమ నాయకుడు పిడమర్తి రవి నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం అన్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీని స్వాగతిస్తున్నామని, ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేకే కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఉద్యమకారుల అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు.