అయ్యప్ప ఆలయంలో రేపు కూడారై ఉత్సవం

నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లన్న గుట్ట అయ్యప్ప ఆలయంలో ఆదివారం కూడారై ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి శనివారం తెలిపారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని, రేపటి కూడారై ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృప పొందాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్