జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయుడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 3న మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో మహాధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు. రెండు సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం వహిస్తున్నదని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 3న హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ రాష్ర్టసమాచార కమిషనర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు.