నిర్మల్ జిల్లాలో నారీశక్తి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల బుధవారం తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ విధులతో పాటు డయల్ 100 కాల్స్‌కు తక్షణమే స్పందించి బాధితుల సమస్యలు పరిష్కరించారు. విలేజ్ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ సిబ్బంది ప్రతి గ్రామంలో కల్తీకల్లు, గంజాయి అక్రమ రవాణాపై ప్రజలకు చైతన్యం కల్పించారు.