నిర్మల్ జిల్లా మాయాపూర్ గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు భీమన్న (40) కుటుంబాన్ని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ శుక్రవారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. ఆపదలో ఉన్నవారికి తోటి వారు తోడ్పాటునందిచాలన్నారు. భీమన్న కుటుంబానికి రూ. 10, 000 చెక్కు సాయంగా అందజేశారు. స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తేనే వ్యవసాయం లాభసాటి అవుతుందన్నారు.